Amazon – Flipkart Sale : ప్రముఖ ఈకామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్ కార్ట్.. దసరా, దీపావళి సందర్భంగా సేల్ ను ప్రారంభించింది. అమెజాన్ ప్రైమ్ మెంబర్స్, ఫ్లిప్ కార్ట్ ప్లస్ మెంబర్స్ కు సేల్ ఈరోజు నుంచే అంటే సెప్టెంబర్ 22 నుంచే ప్రారంభం అయింది. సాధారణ మెంబర్స్ కు సెప్టెంబర్ 23న సేల్ ప్రారంభం కానుంది. అంటే ఇంకొన్ని గంటల్లో అందరికీ ఈ సేల్స్ అందుబాటులోకి రానున్నాయి. ఈ సేల్ లో భాగంగా స్మార్ట్ ఫోన్స్, ఇతర ఎలక్ట్రానిక్ డివైజెస్, ఆడియో ప్రాడక్ట్స్ మీద భారీ డిస్కౌంట్స్ లభించనున్నాయి. వైర్ లెస్ ఇయర్ ఫోన్స్ మీద ప్రత్యేకమైన డిస్కౌంట్ ను అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లో అందిస్తున్నాయి.
వన్ ప్లస్ బడ్స్ ప్రో, జేబీఎల్ ట్యూన్ 130 ఎన్సీ, ఒప్పో ఎన్కో ఎక్స్ 2, సోనీ డబ్ల్యూఎఫ్ ఎక్స్ బీ 700, రియల్ మీద బడ్స్ ఎయిర్ 3 మీద భారీ డిస్కౌంట్స్ లభించనున్నాయి. అలాగే.. స్మార్ట్ ఫోన్స్ అయిన జియోమీ, సామ్ సంగ్, పోకో, ఇంకా ఇతర స్మార్ట్ ఫోన్ బ్రాండ్స్ మీద పలు డిస్కౌంట్స్ లభించనున్నాయి. ఫ్లిప్ కార్ట్ లో బిగ్ బిలియన్ డేస్ సేల్ 2022 లో పాల్గొనే వారు ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సెస్ బ్యాంక్ కార్డు ఉన్నవాళ్లు 10 శాతం డిస్కౌంట్ పొందొచ్చు.

Amazon – Flipkart Sale : ఇన్ స్టంట్ డిస్కౌంట్స్, క్యాష్ బ్యాక్ కూడా
సేల్ లో భాగంగా ఫ్లిప్ కార్ట్ కు సైన్ అప్ అయ్యే వాళ్లకు ప్రత్యేకమైన డిస్కౌంట్ కూడా లభించనుంది. సేల్ లో భాగంగా ఫ్లిప్ కార్ట్ బిగ్ బాంగ్ రివీల్స్ పేరుతో ప్రతి రోజు పలు స్మార్ట్ ఫోన్ల మీద ప్రత్యేకమైన డిస్కౌంట్ లభిస్తుంది. ఇక.. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2022 లో భాగంగా స్మార్ట్ ఫోన్స్, టీవీ, కంప్యూటర్ యాక్సెసరీస్, స్మార్ట్ వాచెస్, ఐఫోన్స్ మీద స్పెషల్ డిస్కౌంట్ లభించనుంది. అమెజాన్ లో ఎస్బీఐ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేసేవాళ్లకు ఇన్ స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది.