Flipkart Big Billion Days 2022 Sale : దసరా సందర్భంగా ఫ్లిప్ కార్ట్‌లో బిగ్ బిలియన్ డే సేల్ నడుస్తున్న విషయం తెలిసిందే. తక్కువ ధరలకే ఫోన్స్, ల్యాప్‌టాప్స్, రిఫ్రిజిరేటర్ వంటివి అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. సేల్ ముగియడానికి కేవలం రెండు రోజులు మాత్రమే మిగిలి ఉంది. అయితే ల్యాప్ టాప్ కొనుగోలు చేసయాలని ఎవరైన అనుకుంటే లెనోవా, ఏసర్, ఆసుసు, ఎంఎస్ఐ వంటి ల్యాప్ టాప్స్ తక్కువ ధరలకే లభ్యం అవుతున్నాయి. Lenovo IdeaPad 1 15ADA7 ప్రస్తుతం 44 శాతం తగ్గింపు ధరతో అందుబాటులో ఉంది, దీని ధర రూ. 30,000 .
ఈ ల్యాప్‌టాప్ 15.6-అంగుళాల పూర్తి-HD TN డిస్‌ప్లే ప్యానెల్‌ను 220 నిట్స్ బ్రైట్‌నెస్‌తో కలిగి ఉంది. ఇది Ryzen 3 3250U ప్రాసెసర్ ఉంటుంది. 8GB DDR4 RAM మరియు 512GB SSD ఆప్షన్స్ తో ఈ ల్యాప్ ట్యాప్ అందుబాటులో ఉంది. Infinix Inbook X1 సిరీస్ మోడల్‌ను రూ. 25,990కే పొందవచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్ తో ఈ ల్యాప్‌టాప్‌ని 18,100కి కూడా పొందవచ్చు. ఈ మోడల్ 8GB DDR4 RAM మరియు 256GB SSD స్టోరేజ్ కలిగి ఉంది. ఇందులో Windows 11 హోమ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్‌స్టాల్ చేయబడింది.

Flipkart Big Billion Days 2022 Sale : మంచి ఫీచర్స్‌తో..
Asus Vivobook 14 మోడల్ క్వాడ్-కోర్ AMD Ryzen 7 3700U ప్రాసెసర్ కలిగా ఉండగా, దీని ధర రూ. 40,990గాఉంది. ఇది 16GB DDR4 RAM మరియు 512GB SSD స్టోరేజ్ కలిగి ఉంది. 14-అంగుళాల ఫుల్-హెచ్‌డి యాంటీ-గ్లేర్ డిస్‌ప్లేను కలిగి ఉండగా, వీటిపై 42 శాతం ఆఫర్ నడుస్తుంది. MSI నుండి ఈ గేమింగ్ ల్యాప్‌టాప్ రూ. 49,990కి అందుబాటులో ఉంది. 8GB DDR4 ర్యామ్ మరియు 512GB SSD స్టోరేజీని కలిగి ఉంది. ఇక Acer Aspire 7 రూ. 51,990కి లభిస్తుంది 8GB DDR4 RAM మరియు 512GB SSD స్టోరేజ్‌ని కలిగి ఉంది. Acer Predator Helios 300 గేమింగ్ ల్యాప్‌టాప్‌ను 38 శాతం తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది, 23,100 ధరకి దీనిని దక్కించుకోవచ్చు.