iPhone 11 : ఐఫోన్ తీసుకోవాలి అనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ దాని భారీ ధర వలన కొనలేక పోతుంటారు. అలాంటి వారికే ఒక శుభవార్త తీసుకొచ్చింది ఫ్లిప్ కార్ట్. పండగ సీజన్లో భాగంగా ఈ కామర్స్ సైట్స్ వరుసగా ఆఫర్లను ప్రకటిస్తుంది. దీనిలో భాగంగా ఫ్లిప్కార్ట్ బిగ్ దివాలి సెల్ పేరుతో భారీ ఆఫర్స్ ను తీసుకొచ్చింది. ఇక దీనిలో ఐఫోన్ 11 కేవలం రూ.17,000 కి సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఐఫోన్ 11 4 జిబి రామ్ 64gb ఇంటర్నల్ స్టోరేజ్ ఫోన్ దివాళి ఆఫర్స్ లో భాగంగా రూ.9,910 తగ్గింపు ధరతో లభిస్తుంది.
కాగా ఇది ఇప్పుడు రూ.33,990గా ఉంది. అలాగే దీనిపై బ్యాంక్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. ఎస్బిఐ మరియు కోటక్ బ్యాంక్ క్రెడిట్ కార్డులను యూస్ చేసి తీసుకోవడం వలన అధనంగా 10 శాతం డిస్కౌంట్ ను పొందవచ్చు. అలాగే దీవాలి సెల్ లో భాగంగా పాత ఫోన్ ను ఎక్స్చేంజ్ చేయడం ద్వారా 16,900 తగ్గింపు ను పొందవచ్చు. అయితే దీనికి మీ పాత ఫోన్ మంచి కండిషన్లో ఉండాలి. ఇవన్నీ ఆఫర్లను కలుపుకొని ఐఫోన్11 ను కేవలం రూ.17,090 కే సొంతం చేసుకోవచ్చు.

ఇక ఐఫోన్ 11 స్మార్ట్ ఫోన్ యొక్క ఫీచర్ల విషయానికొస్తే.. ఇది 6.5 ఇంచెస్ ఐసిఎస్ ఎల్సిడి స్క్రీన్ డిస్ ప్లే ను కలిగి ఉంది. అలాగే దీనిలో ఐఓఎస్ 13 ఆపరేటింగ్ సిస్టమ్ మరియు యాపిల్ a30 బయోనిక్ ప్రొసెసర్ ను అందిస్తున్నారు. ఇక కెమెరా విషయానికొస్తే ఐఫోన్ 11 లో 12 మెగాపిక్సల్ రియర్ కెమెరా మరియు 12 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాను ఇచ్చారు. అలాగే ఈ ఫోన్ ఫేస్ ఐడి అల్ట్రా వైడ్ బ్యాండ్ కు సపోర్ట్ చేస్తుంది. అలాగే ఐఫోన్11 , 3110ఎంఏఎచ్ బ్యాటరీతో లభిస్తుంది.