Huge discount on TV’s : స్మార్ట్ టీవీ కొనాలనుకునే వారికి ప్రస్తుతం ఈ కామర్స్ సేల్స్ లో ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. దీనిలో చాలా కంపెనీల స్మార్ట్ టీవీలు డిస్కౌంట్లకు లభిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుతం అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ లో భాగంగా వన్ ప్లస్ బ్రాండ్ స్మార్ట్ టీవీ డీల్ ఆకర్షణీయంగా ఉంది.ఈ డీల్ కొంతకాలమే ఉంటుంది. వన్ ప్లస్ ఫైవ్ వన్ ఎస్ ప్రో సిరీస్లో 50 ఇంచుల 4 కేే స్మార్ట్ టీవీ , అతి తక్కువ ధరతో అందుబాటులో ఉంది. దీనికి బ్యాంకు ఆఫర్స్ కూడా ఉన్నాయి.
వన్ ప్లస్ 50 y1s ప్రో 4కే స్మార్ట్ టీవీ ప్రస్తుతం అమెజాన్ లో డిస్కౌంట్ తో కలిపి రూ.30.999 ధరకే లభిస్తుంది. అసలు కంటే చాలా తక్కువ ధరకే ఈ స్మార్ట్ టీవీ అందుబాటులో ఉంది. దీనితోపాటు ఐసిఐసిఐ మరియు యాక్సిస్ బ్యాంక్, సిటీ బ్యాంక్ , క్రెడిట్ కార్డ్ ఉన్నవారికి ఇది మరింత తగ్గింపు ధరలకే లభిస్తుంది. ఈ బ్యాంక్ క్రెడిట్ కార్డులను ఉపయోగించి కొనుగోలు చేయడం ద్వారా రూ.4,250 అదనపు డిస్కౌంట్ లభిస్తుంది.

అంటే బ్యాంక్ కార్డులను ఉపయోగించడం ద్వారా ఈ స్మార్ట్ టీవీని రూ.26,749 కేే పొందవచ్చు.ఇక వన్ ప్లస్ 50 y1s ప్రో ,స్మార్ట్ టీవీ యొక్క స్పెసిఫికేషన్ల విషయానికొస్తే , 50 ఇంచుల 4k డిస్ ప్లే ను కలిగి ఉంది. అలాగే దీనిలో 2జిబి ర్యామ్ 8gb ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. గూగుల్ వాయిస్ అసిస్టెంట్ , గూగుల్ క్రోమ్ కాస్ట్ కు సపోర్ట్ చేస్తుంది. అలాగే ఓటిటి ప్లాట్ ఫామ్ లకు సపోర్ట్ చేస్తుంది. అలాగే డ్యూయల్ బాండ్ వైఫై , బ్లూటూత్ , 3HDMI పోర్టులు ,2 USB లను కలిగి ఉంది. అలాగే దీనిలో డాల్బీ ఆడియో మరియు 24 వాట్ ల సౌండ్ ఔట్ పుట్ ఇచ్చే స్పీకర్లు ఉన్నాయి.