iPhone 13 : 20వేల వ్యత్యాసంతో ఐఫోన్ 13… ఐఫోన్ 14 కు మాత్రం తీసిపోదు…!

Advertisement

iPhone 13 : ప్రతి ఒక్కరికి ఐఫోన్ తీసుకోవాలనే కోరిక ఉంటుంది.అయితే ఇప్పుడు ఐఫోన్ సిరీస్లో, ఐఫోన్ 13 మరియు ఐఫోన్ 14 లాంచ్ అయ్యాయి. ధర పరంగా చూసుకుంటే ఐఫోన్ 13… ఐఫోన్ 14 కు మధ్య రూ.20 వేల తేడా ఉంది .ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ సెల్ లో భాగంగా ఐఫోన్ 13 చాలా తక్కువ ధరకే లభిస్తోంది. ఈ దశలో రూ.51,990 కే ,ఐఫోన్ 13 128GB మోడల్ లభించగా సేల్ చివరి రోజున ఇది రూ.58,990కు అందుబాటులో ఉంది .అలాగే ఐఫోన్ 14 128GB ధర రూ.79,990 గా ఉంది.

Advertisement

ఎలా చూసుకున్నా ఈ రెండు ఫోన్ల మధ్య దాదాపు 20వేల వ్యత్యాసం ఉంది. స్పెసిఫికేషన్ల పరంగా చూసుకుంటే ఐఫోన్ 13 మరియు ఐఫోన్ 14 మధ్య పెద్దగా తేడాలు ఏమీ లేవు.రెండు ఫోన్లు కూడా ఏ 15 బయోనిక్ ప్రొసెసర్ తో వస్తున్నాయి. అలాగే ఐఫోన్13 4GB ర్యామ్ తో ఐఫోన్14 6GB ర్యామ్ తో వస్తున్నాయి.ఈ రెండు ఫోన్లు 5జీ కనెక్టివిటీ సపోర్ట్ ను కలిగి ఉన్నాయి.ఇంకా కెమెరా విషయానికొస్తే రెండు ఫోన్లు వెనక 12 మెగాపిక్సల్ ప్రైమరీ కెమెరా మరియు 12 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరాలు ఉన్నాయి. లైట్ డల్ గా ఉన్న సందర్భాల్లో ఐఫోన్ 14 కాస్త మెరుగ్గా పనిచేస్తుంది.

Advertisement
iPhone 13 iPhone 14 will not be removed With a difference of 20,000
iPhone 13 iPhone 14 will not be removed With a difference of 20,000

అలాగే రెండు మోడల్స్ కు 12 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాలు ఉన్నాయి. ఇక డిస్ ప్లే విషయానికి వస్తే , రెండు ఫోన్లు 6.1 ఇంచుల , సూపర్ రెటీనా XDR డిస్ ప్లే లను కలిగి ఉన్నాయి.ఇక రెండు ఫోన్ల డిజైన్లు ఒకే మాదిరిగా ఉన్నాయి.ఇక బ్యాటరీ విషయంలో ఐఫోన్ 13 కంటే , ఐఫోన్14 , 20 శాతం ఎక్కువ లైఫ్ ఇస్తుందని యాపిల్ కంపెనీ చెప్తుంది. మొత్తంగా ఈ రెండు మొబైల్ లు ఒకే రకమైన ప్రొసెసర్ ను, కెమెరా సామర్థ్యంను , డీస్ ప్లేను కలిగి ఉన్నాయి ఇక ధర పరంగా చూసుకుంటే ఐఫోన్ 14 కంటే ఐఫోన్ 13 ని కొనుగోలు చేసి రూ.20 వేల వరకు సేవ్ చేసుకోవచ్చు. డబ్బు ఎక్కువ అయిన పర్లేదు ఎక్కువ ర్యామ్ మెరుగైన కెమెరా కావాలనుకునేవారు ఐఫోన్ 14తీసుకోవచ్చు.

Advertisement