Jio : దసరా పండగలో భాగంగా కొన్ని దిగ్గజ కంపెనీలు ఆఫర్లతో తమ కస్టమర్స్ ను ఆకట్టుకుంటున్నాయి. ఆన్ లైన్ యాప్స్ అయినా ఫ్లిప్ కార్ట్ మరియు అమెజాన్ వీటికి నిదర్శనం.అయితే ఇప్పుడు జియో కూడా తమ కస్టమర్లకు పండగ ఆఫర్లను తీసుకొచ్చింది.అలాగే అదిరిపోయే బెనిఫిట్స్ తో కస్టమర్లను ఆకట్టుకుంటుంది.అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. జియో అతిపెద్ద ఇంటర్నెట్ సర్వీస్ అయిన ప్రొవైడర్ జియో ఫైబర్, తమ కస్టమర్స్ కు అదిరిపోయే ఆఫర్లను తీసుకువచ్చింది .జియో ఫైబర్ రీఛార్జ్ ప్లాన్స్ లో , రెండు రకాల ప్లాన్స్ కు మంచి బెనిఫిట్స్ ను అందిస్తుంది.
అయితే ఈ ఆఫర్లు అక్టోబర్ 9 వరకు అందుబాటులో ఉంటాయి. జియో ఫైబర్ తమ కస్టమర్లకు ప్రీపెయిడ్ ప్లాన్స్ మరియు, పోస్ట్ పెయిడ్ సర్వీసులను ఇస్తుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇందులో పోస్ట్ పెయిడ్ ప్లాన్స్ లో, ఒక రెండు ప్లాన్స్ కు ఆఫర్లను తీసుకొచ్చింది. అవి రూ.599 ,రూ.899 ప్లాన్స్ . దీనిలో రూ.599 ప్లాన్ ఎంచుకునే వారికి రిలయన్స్ డిజిటల్ రూ.1000 క్యూపన్ లభిస్తుంది. మరియు రూ.1000 మింత్రా డిస్కౌంట్ క్యూపన్ లభిస్తుంది.అలాగే అజియో డిస్కౌంట్ క్యూపన్ రూ.1000 లభిస్తుంది.

అయితే కనీసం ఆరు నెలల ప్లాన్ రీఛార్జ్ చేసుకున్న వారికి మాత్రమే ఈ తగ్గింపు ప్రయోజనాలు ,లేకుంటే ఈ బెనిఫిట్స్ ను పొందలేరు. ఇక రూ.899 ప్లాన్ విషయానికి వస్తే ఈ ప్లాన్ పై రూ.500 విలువైన రిలయన్స్ డిజిటల్ క్యూపన్ పొందవచ్చు. అలాగే రూ.500 తగ్గింపుతో కూడిన మింత్రా ఓచర్ మరియు ఆజీయే ద్వారా రూ.1000 తగ్గింపు పొందవచ్చు.ఈ ప్లాన్ కనీసం మూడు నెలలు రీచార్జ్ చేసుకున్న వారికి లభిస్తుంది.
అలాగే రూ.599 పోస్ట్ పెయిడ్ ప్లాన్ లో 30mbps నెట్ స్పీడ్ ను పొందవచ్చు.అలాగే మై జియో యాప్ ద్వారా ఉచిత జియో సెటప్ బాక్స్ ను రిక్వెస్ట్ పెట్టుకోవడం ద్వారా పొందవచ్చు.