Jio : సాధారణంగా ఏ నెట్ వర్క్ లో అయినా రీచార్జ్ చేయించుకుంటే కేవలం 28 రోజుల వాలిడిటీ మాత్రమే ఇస్తారు. లేదంటే 84 రోజుల వాలిడిటీ ఉన్న ప్యాక్ ను వేసుకోవాల్సి ఉంటుంది. ఎయిర్ టెల్ అయినా జియో అయినా.. మరే నెట్ వర్క్ అయిన సరే.. 28 రోజుల వాలిడిటీ మాత్రమే ఉంటుంది. వాయిస్ కాల్స్ అయినా డేటా అయినా ఆ 28 రోజుల వాలిడిటీ మాత్రమే ఉంటుంది. కానీ.. ఈసారి జియో సరికొత్త ప్లాన్ ను ప్రవేశపెట్టింది. అదే రూ.259 ప్లాన్.
జియో రూ.259 ప్లాన్ ప్రకారం నెల రోజుల వాలిడిటీ రానుంది. అంటే 28 రోజులు కాకుండా ఆ నెలలో 30 రోజులు ఉంటే 30 రోజులకు, 31 రోజులు ఉంటే 31 రోజులకు వాలిడిటీ వర్తిస్తుంది. అంటే నెల వారి సైకిల్ ఆధారంగా ఈ ప్లాన్ వర్క్ అవుతుంది. క్యాలెండర్ మంథ్లీ వాలిడిటీ ప్లాన్ ను జియో ప్రారంభించడానికి కారణం.. ట్రాయ్ ఆర్డర్స్. ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్స్ అన్నీ నెల వారి వాలిడిటీ ఉండాలంటూ ఇటీవల ట్రాయ్ అన్ని టెలికం ఆపరేటర్లకు ఆదేశాలు జారీ చేసింది.

Jio : కొత్త, పాత కస్టమర్లు ఈ ప్లాన్ తో రీచార్జ్ చేసుకోవచ్చు
కొత్త, పాత కస్టమర్లు ఈ ప్లాన్ ను రీచార్జ్ చేసుకోవచ్చు. రూ.259 పెట్టి రీచార్జ్ చేస్తే సరిగ్గా నెల రోజుల వాలిడిటీ ఉంటుంది. అంటే.. మీరు అక్టోబర్ 1న రీచార్జ్ చేసుకుంటే.. మళ్లీ నవంబర్ 1 న రీచార్జ్ చేసుకోవచ్చు. ఆ నెలలో 28 రోజులు ఉన్నా.. 30 రోజులు ఉన్నా.. 31 రోజులు ఉన్నా కూడా నెల రోజుల వాలిడిటీ లభిస్తుంది. అందుకే నెల రోజుల వాలిడిటీ కావాలనుకుంటే రూ.259 ప్లాన్ తో రీచార్జ్ చేసుకోవచ్చు. ఈ ప్యాక్ తో రీచార్జ్ చేసుకుంటే ప్రతి రోజు 1.5 జీబీ హైస్పీడ్ డేటా, అల్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్ లు, జియో యాప్స్ కు కాంప్లిమెంటరీ సబ్ స్క్రిప్షన్ లభించనుంది.