Mobile Applications: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్‌తో గంటల కొద్ది గడుపుతున్న విషయం తెలిసిందే. స్మార్ట్ ఫోన్ వచ్చిన దగ్గర నుండి వారి మెదడుకి పని చెప్పడం చాలా తగ్గించేశారు. దాదాపు ముఖ్యమైన సమాచారం అంతా కూడా ఫోన్లోనే ఉంచుకుంటున్నారు. అయితే స్మార్ట్ ఫోన్స్‌ని పిల్లలు కూడా ఎక్కువ ఉపయోగిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ లో ఎక్కువ సమయం పిల్లలు గడపటం వల్ల వారిలో ప్రవర్తనా సమస్యలు, నాడీ సంబంధిత సమస్యలు, ఒబేసిటీ, నిద్రలేమి, డిప్రెషన్ వంటి అనేక అనారోగ్య సమస్యలు కలుగుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఆరోగ్యానికి కూడా హాని చేస్తుందని ఇప్పటికే వైద్యులు పదేపదే హెచ్చరిస్తున్న విషయం తెలిసిందే.
Mobile Applications : జర జాగ్రత్త..
అయితే కొందరు తమ కోసం తమ పిల్లల కోసం ప్రత్యేక యాప్స్ ఫోన్ లో ఉంచుకుంటారనే విషయం తెలిసిందే. అయితే అవసరం ఉంటే తప్ప అనవసరంగా యాప్స్‌ను ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోవద్దు. ఎందుకంటే అన్ని యాప్స్ సురక్షితంగా ఉండకపోవచ్చు. షార్క్‌బాట్ మాల్వేర్ మళ్లీ గూగుల్ ప్లేస్టోర్‌లోకి వచ్చింది. ఫేక్ యాంటీ వైరస్ యాప్స్, క్లీనర్ యాప్స్‌లో ఇది ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మాల్వేర్ యూజర్ల బ్యాంకింగ్ డేటాను తస్కరిస్తోంది. దీని వలన మీ బ్యాంకింగ్ వివరాలు మోసగాళ్ల చేతికి చేరే ప్రమాదం ఉంటుంది.

మిస్టర్ ఫోన్ క్లీనర్, కిల్హవీ మొబైల్ సెక్యూరిటీ వంటి యాప్స్‌తో జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటికే ఈ యాప్స్‌ను 60 వేల సార్లు ఇన్స్టాల్ చేసుకున్నారు. దీని వలన మీ మొబైల్లో పూర్తి డేటాని తస్కరించే ప్రమాదం ఉంది. ఎన్సీసీ గ్రూప్‌కు చెందిన ఫాక్స్ ఐటీ ప్రకారం.. స్పెయిన్, ఆస్ట్రేలియా, పోలాండ్, జర్మనీ, యూఎస్, ఆస్ట్రియాలోని యూజర్లు లక్ష్యంగా ఈ మాల్వార్ను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. గూగుల్ ఈ యాప్స్‌ను నిషేధించిందని తెలిపారు. అందువల్ల ఇంకా ఎవరైనా వీటిని ఉపయోగిస్తూ ఉంటే డిలేట్ చేయడం మంచిది. కాగా షార్క్‌బాట్ అనేది బ్యంకింగ్ ట్రోజన్. ఇది క్రిప్టో యాప్స్, ఫైనాన్షియల్ యాప్స్ లక్ష్యంగా పని చేస్తుంది. వీటి నుంచి డేటాను తస్కరిస్తుంది.