Motorola Edge 30 Ultra : మోటోరోలా ఎప్పటికప్పుడు సరికొత్త ఫోన్స్‌ని మార్కెట్లోకి లాంచ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఆండ్రాయిడ్ 13 అప్డేట్ను నాలుగు ఎడ్జ్ మోడల్స్, ఆరు జీ సిరీస్ ఫోన్లకు ఇవ్వనున్నట్టు మోటోరోలా వెల్లడించింది. ఈ వివరాలను అధికారిక వెబ్సైట్ ద్వారా తెలిపింది. అయితే ఫోన్ లవర్స్ కొంత కాలంగా మోటోరోలా ఎడ్జ్ 30 అల్ట్రా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరో వారంలో ఇది విడుదల కానున్నట్టు తెలుస్తుంది. ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే… ఏకంగా 200 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, క్వాల్కామ్ అధునాతన స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్ లాంటి ఫ్లాగ్షిప్ స్పెసిఫికేషన్లతో ఈ మొబైల్ వస్తోంది.
మంచి ఫీచర్స్‌తో..

ఇప్పటికైతే ఈ ఫోన్ గ్లోబల్‌గా లాంచ్ కాగా భారత్‌లోను అడుగుపెట్టేందుకు రంగం సిద్ధమైంది. ఆండ్రాయిడ్ 12 బేస్ట్ మై యూఎక్స్ స్కిన్‌తో ఈ మొబైల్ వస్తోంది. 6.67 ఇంచుల ఫుల్ హెచ్డీ+ pOLED కర్వ్డ్ ఎడ్జెస్ డిస్ప్లేను మోటోరోలా ఎడ్జ్ 30 అల్ట్రా కలిగి ఉంది. ఈ ఫోన్ వెనుక మూడు కెమెరాల సెటప్ ఉంది. 200 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాగా ఉంటుంది. దీనికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, 12 మెగాపిక్సెల్ టెలిఫొటో లెన్స్ మిగిలిన రెండు కెమెరాలుగా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ మొబైల్‌కు 60 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను మోటోరోలా ఇచ్చింది. 1250 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 144Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. డిస్ప్లేకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ కూడా ఉంటుంది.
ఈ ఫోన్లో 4610mAh బ్యాటరీ ఉంటుంది. 125 వాట్ల టర్బో వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది. డాల్బీ అట్మోస్ సపోర్ట్ ఉండే డ్యుయల్ స్టీరియో స్పీకర్లు ఈ ఫోన్‌కు ఉన్నాయి. 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6ఈ, బ్లూటూత్ వీ5.2, జీపీఎస్/A-జీపీఎస్, NFC, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, డిస్ప్లే పోర్ట్ 1.4 కనెక్టివిటీ ఫీచర్లుగా ఉన్నాయి. యూరప్‌లో ఈ మొబైల్ 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ 899 యూరోలు (సుమారు రూ.72,150)గా ఉంది. మన దగ్గరకు వచ్చే సరికి ఎంత ఉండే అవకాశం ఉందో అని లెక్కలు వేస్తున్నారు. ఈ ఫోన్ కోసం అయితే చాలా మంది ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.