Offers : ఆన్లైన్లో వస్తువులు కొనుగోలు చేసే వారికి శుభవార్త. ప్రముఖ ఈకామర్స్ సైట్స్ అమెజాన్, ఫ్లిప్ కార్ట్ బిగ్ సేల్స్ ప్రకటించాయి. ఇక తక్కువ ధరలకు మీరు మెచ్చిన వస్తువులని ఆన్లైన్లో కొనుగోలు చేసుకోండి. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ పేరిట అమెజాన్, బిగ్ బిలియన్ డేస్ సేల్‌ను ఫ్లిప్‌కార్ట్ నిర్వహించనున్నాయి. ఇందులో పలు రకాల వస్తువులపై బంపర్ ఆఫర్స్ ప్రకటిస్తున్నాయి. ఇందులో స్మార్ట్ఫోన్లు, స్మార్ట్‌టీవీలు, ల్యాప్‌టాప్‌లు, హెడ్‌ఫోన్స్ లాంటి ఎలక్ట్రానిక్స్‌పై ఆఫర్లను అందుబాటులోకి తెచ్చాయి. సేల్‌లో ఉండే ధరను ఇప్పుడే పొందండి అంటూ కొన్నింటిపై ఇప్పుడే ఆఫర్లను ఇస్తోంది ఫ్లిప్‌కార్ట్. సేల్స్‌లో ఉండే బ్యాంక్ కార్డ్ ఆఫర్లు కూడా ఈ ముందస్తు డీల్స్‌లో ఉన్న వాటికి వర్తిస్తాయి.
Offers బిగ్ ఆఫర్స్..
అమెజాన్ విషయానికి వస్తే.. కిక్ స్టాటర్ డీల్స్‌లో ఎస్బీఐ డెబిట్, క్రెడిట్ కార్డులపై 10 శాతం డిస్కౌంట్ ఆఫర్ ఉంది.ముందస్తు సేల్‌లో ఎస్బీఐ కార్డులతో కొంటే అదనంగా 10శాతం తగ్గింపు వర్తిస్తుంది. కొన్ని ప్రొడక్టులపై సేల్ ధరలను ఫ్లిప్‌కార్ట్ ఇప్పటికే అందుబాటులో ఉంచింది. ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌లపై 10శాతం వరకు డిస్కౌంట్లు వర్తిస్తాయి. ప్రస్తుతం అమెజాన్‌లో ఐకూ 9 5జీ, ఐకూ 9 5జీ ప్రో, రియల్మీ నార్జో 50ఐతో పాటు మరికొన్ని మొబైల్స్‌పై డిస్కౌంట్లు ఉన్నాయి. ప్రముఖ బ్రాండ్లకు చెందిన స్మార్ట్ టీవీలపై 50 శాతం వరకు ఆఫర్లు అందుబాటులోకి వచ్చాయి. ల్యాప్‌టాప్‌లు, హెడ్‌ఫోన్స్, టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్, స్మార్ట్‌వాచ్‌లు సహా ఎలక్ట్రానిక్స్పైనా డిస్కౌంట్లు ఉన్నాయి.

ఇక ఫ్లిప్ కార్ట్ విషయానికి వస్తే.. రియల్మీ 9 ప్రో 5జీ, రియల్మీ 9 ప్రో ప్లస్ 5జీ, రియల్మీ సీ31, రియల్మీ జీటీ2పై డిస్కౌంట్లు అందుబాటులోకి వచ్చాయి. కార్డ్ ఆఫర్లతో దాదాపు రూ.5వేల వరకు తగ్గింపు పొందవచ్చు. పోకో బ్రాండ్ మొబైల్స్‌పైనా డిసౌంట్లు ఉన్నాయి. ప్రధానమైన సేల్స్‌లో దాదాపు అన్నింటిపైనా విస్తృతమైన డిస్కౌంట్స్ లభిస్తాయి. ఏదైనా ఆఫర్ చాలా బెస్ట్ అనిపిస్తే ఇప్పుడు కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం డీల్స్‌లో లేనివి కొనాలనుకుంటే ప్రధానమైన సేల్‌లో ఆఫర్లకు అందుబాటులోకి రావొచ్చు. ఇక అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్, ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ఈనెల 23వ తేదీన ప్రారంభమయ్యే అవకాశం ఉంది.