Redmi : తక్కువ ధరలో స్మార్ట్ ఫోన్ కావాలనుకునే వారికి రెడ్ మీ ఒక ఆఫర్ ను తీసుకొచ్చింది. దీనిలో భాగంగా టెక్చర్ ఫినిష్ ఉన్న బ్యాక్ ప్యానెల్ తో రెడ్ మీ A1 ప్లస్ ను తీసుకొచ్చింది. దీనిలో ఎంఐయుఐ ఓఎస్ కాకుండా దాదాపు స్టాక్ ఆండ్రాయిడ్ ఓఎస్ ఈ స్మార్ట్ ఫోన్ లో ఉంది. ఇక వివరాల్లోకెళ్తే రెడ్ మీ A1+ , 2వేరియంట్ లలో లాంచ్ అయింది. ఈ ఫోన్ 2Gb రామ్ 32Gb స్టోరేజ్ తో వస్తుంది. ఇక దీని ధర రూ.6,999 గా ఉంది. అలాగే 3Gb రామ్ 32Gb ఇంటర్నల్ స్టోరేజీ గల ఫోన్ రూ.7,999 గా ఉంది. ఇక వీటిని ఇంట్రడరి ధరలుగా పేర్కొంది రెడ్ మీ.
ఈనెల 17వ తేదీన మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ కామర్స్ సైట్ సేల్ మొదలవుతుంది. అయితే ఇంట్రడరి ధరలు ఈనెల 31 వరకు మాత్రమే ఉంటాయట. ఆ తర్వాత నుండి రెడ్ మీ A1+, 2 జీబీ ర్యామ్ ఫోన్ ధర రూ.7,499 మరియు 3 జీబీ రామ్ ధర రూ.8,499 గా ఉంటాయని రెడ్ మీ పేర్కొంది. అలాగే ఈ ఫోన్లు బ్లాక్, లైట్ బ్లూ, లైట్ గ్రీన్ కలర్స్ లో లభిస్తాయి.ఇక స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే , ఇది 6.52 ఇంచుల హెచ్ డీ + IPS LCD డిస్ ప్లే తో రానుంది.

అలాగే ఇది ఆక్టాకోర్ట్ మీడియాటెక్ హీలియో ఏ22 ప్రొఫెసర్ తో రన్ అవుతుంది.కెమెరా విషయానికొస్తే దీని వెనుక రెండు కెమెరాలు ఉన్నాయి. 8 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉండగా…మరో లెన్స్ కెమెరా కూడా ఉంది. అలాగే 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. అలాగే ఈ ఫోన్లో 5000 mAh బ్యాటరీ ఉంది. ఇంకా ఈ ఫోన్లో డ్యూయల్ సిమ్, 4 జీ ఎల్ టిఈ , బ్లూటూత్ , జీపీఎస్ , 3.5 ఎం ఎం , హెడ్ ఫోన్ జాక్ , యుఎస్ బి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.