Samsung Credit Card : సామ్ సంగ్ కంపెనీ అంటే మనకు గుర్తొచ్చేది ఏంటి.. ఎలక్ట్రానిక్ వస్తువులు. ఎలక్ట్రానిక్ వస్తువులు, గ్యాడ్జెట్లకు పెట్టింది పేరు ఈ కంపెనీ. కానీ.. ఇప్పుడు సామ్ సంగ్ నుంచి క్రెడిట్ కార్డ్ వచ్చేసింది. తాజాగా భారత్ లో క్రెడిట్ కార్డ్ ను లాంచ్ చేశారు. యాక్సెస్ బ్యాంక్ తో పార్టనర్ అయిన సామ్ సంగ్.. వీసా కార్డును భారత కస్టమర్ల కోసం లాంచ్ చేసింది. ఈ కార్డు ద్వారా మిగితా కార్డుల కన్నా చాలా బెనిఫిట్స్ పొందొచ్చని సామ్ సంగ్ కంపెనీ వెల్లడించింది. ఈ కార్డు ద్వారా సామ్ సంగ్ ప్రాడక్ట్స్, సర్వీసులపై 10 శాతం క్యాష్ బ్యాక్ పొందొచ్చు.
దానితో పాటు ఇతర బెనిఫిట్స్ కూడా ఈ కార్డు ద్వారా లభించనున్నాయి. ఈఎంఐ, నాన్ ఈఎంఐ ఆప్షన్ల ద్వారా కూడా క్యాష్ బ్యాక్ ను పొందొచ్చు. బిగ్ బాస్కెట్, మింత్రా, టాటా 1 ఎంజీ, అర్బన్ కంపెనీ, జొమాటో లాంటి బ్రాండ్స్ తో సామ్ సంగ్ ఇండియా, యాక్సెస్ బ్యాంక్ టైఅప్ అయ్యాయి. ఈ బ్రాండ్స్ లో ఈ కార్డు మీద షాపింగ్ చేస్తే ఆఫర్లు, రివార్డులను పొందొచ్చు. అలాగే.. కాంప్లిమెంటరీ ఎయిర్ పోర్ట్ లాంజ్ యాక్సెస్, ఫుయెల్ సర్ చార్జ్ వేవర్, డైనింగ్ ఆఫర్స్ పొందొచ్చు. వీసా సిగ్నేచర్, వీసా ఇన్ ఫైనైట్ పేరుతో రెండు కార్డులను వినియోగదారులకు సామ్ సంగ్ అందించనుంది.

Samsung Credit Card : పలు బ్రాండ్స్ తోనూ టైఅప్ అయిన సామ్ సంగ్
సిగ్నేచర్ వేరియంట్ కార్డు ఉన్నవాళ్లు సంవత్సరానికి రూ.10,000 వరకు క్యాష్ బ్యాక్ పొందొచ్చు. నెలకు రూ.2500 వరకు క్యాష్ బ్యాక్ పొందొచ్చు. ఇన్ ఫైనైట్ వేరియంట్ కార్డ్ ఉన్నవాళ్లు రూ.20,000 వరకు సంవత్సరానికి క్యాష్ బ్యాక్ పొందొచ్చు. నెలకు రూ.5 వేల వరకు క్యాష్ బ్యాక్ పొందొచ్చు. సంవత్సరానికి సిగ్నేషన్ వేరియంట్ కార్డు ఉన్నవాళ్లకు రూ.500 సంవత్సరం ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇన్ ఫైనైట్ కార్డు ఉన్న వాళ్లు రూ.5000 సంవత్సరం ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ కార్డు కావాలనుకునే వాళ్లు సామ్ సంగ్ యాక్సెస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కోసం సామ్ సంగ్ వెబ్ సైట్ లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.