Smart Phone : ఇప్పటివరకు ది బెస్ట్ కెమెరాను కలిగిన స్మార్ట్ ఫోన్ ఆపిల్ ఐఫోన్ 14 ప్రో. అయితే ఇప్పుడు దీనికి గట్టి పోటీ వచ్చేసింది. గత వారంలో టెక్ దిగ్గజమైన గూగుల్ ప్రపంచవ్యాప్తంగా పిక్సెల్ 7 సిరీస్ లాంచ్ చేసింది. ప్లాగ్ షిప్ కెమెరాలు ప్రీమియం స్పెసిఫికేషన్ లతో దీనిని తీసుకొచ్చింది గూగుల్. ఎన్నో అప్ గ్రేడ్స్ తో ఆకర్షణీయమైన డిజైన్లతో గూగుల్ పిక్సెల్ 7 మరియు గూగుల్ పిక్సెల్ 7ప్రో లను లాంచ్ చేసింది. అయితే కెమెరా విషయంలో గూగుల్ పిక్సెల్ 7 ప్రో నెంబర్ వన్ గా నిలిచింది. DxOMARK కెమెరా బెంచ్ మార్క్ టెస్టింగ్ లో గూగుల్ పిక్సెల్ 7 ప్రో టాప్ గా నిలిచింది. అలాగే కెమెరా ర్యాంకింగ్ లో అత్యధిక పాయింట్లు తో అగ్రస్థానాన్ని సాధించింది.
అయితే ఇప్పుడి ఇది ఐఫోన్ 14 కంటే ఎక్కువ పాయింట్లు సాధించిందని తెలుస్తుంది. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కెమెరా టెస్టింగ్ లో గూగుల్ పిక్సెల్ ఏకంగా 147 పాయింట్లు సాధించింది. దీన్ని బట్టి ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యుత్తమ బెస్ట్ కెమెరా కలిగిన స్మార్ట్ ఫోన్ గూగుల్ పిక్సెల్ 7 ప్రో అని DxOMARK వెల్లడించింది. అయితే గూగుల్ పిక్సెల్ 7 ప్రో వెనుక మూడు కెమెరాలు కలిగి ఉంది. ఇక దానిలో 50 మెగాపిక్సల్ ప్రైమరీ, 48 మెగా పిక్సెల్ టెలిఫోటో , 12 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ కెమెరాలు ఉన్నాయి. అయితే గూగుల్ పిక్సెల్ 7 ప్రో తర్వాత ,రెండో స్థానంలో హానర్ మ్యాజిక్ 4 నిలిచింది.

పాయింట్లు విషయంలో హానర్ మ్యాజిక్ 4 , గూగుల్ పిక్సల్ 7 కు సరి సమానంగా నిలిచింది.
ఈ రెండిటి తర్వాత 146 పాయింట్స్ లతో ఐఫోన్ 14 మూడో స్థానంలో నిలిచింది. ఇక దీని తర్వాత హువావే పి 50 ప్రో 143 పాయింట్స్ ,ఐఫోన్ 14 ప్రో మాక్స్ 141 పాయింట్స్ తో తర్వాత స్థానంలో ఉన్నాయి. అలాగే గూగుల్ పిక్సెల్ 7 ప్రో ఫోన్ స్టీల్ ఫోటోగ్రఫీ లో 148 పాయింట్స్ ను , వీడియోలో 143 పాయింట్స్ ను దక్కించుకుంది. అలాగే డే లైట్ మరియు లో లైట్ ఇలా అన్ని కండిషన్లలోను గూగుల్ పిక్సెల్ 7ప్రో ,అగ్రస్థానాన్ని సాధించిందని DxOMARK వెల్లడించింది.