Vivo Diwali offers : 101 కే వివో స్మార్ట్ ఫోన్ … అమెజాన్ ఫ్లిప్ కార్ట్ కు దీటుగా వివో దివాళి ఆఫర్స్….

Advertisement

Vivo Diwali offers : వివో సంస్థ అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ లకు పోటీగా అదిరిపోయే దివాళి ఆఫర్స్ ను తీసుకొచ్చింది. దీనిలో భాగంగా ఫోన్లపై ఏకంగా 14000 వరకు తగ్గింపును అందిస్తుంది వివో. అయితే ఇప్పుడు కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలి అనుకునే వారికి వివో ఒక మంచి భారీ తగ్గింపు ఇస్తుంది. అమెజాన్ మరియు క్లిప్ కార్ట్ వంటి దిగ్గజా ఈ కామర్స్ సంస్థలకు పోటీగా వివో కూడా దీవాలి సేల్ ను ప్రకటించింది. ఈ సెల్ అక్టోబర్ 23 వరకు అందుబాటులో ఉంటుంది.అయితే వివో కంపెనీ బిగ్ జాజ్ దీపావళి సేల్ ను నిర్వహిస్తోంది. ఇక దీనిలో భాగంగా కంపెనీకి చెందిన పలు రకాల స్మార్ట్ ఫోన్ లను అతి తక్కువ ధరకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇంకా వీటికి బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అందువలన ఇవి గరిష్టంగా 14 వేల వరకు డిస్కౌంట్ తో లభిస్తున్నాయి.

Advertisement

ఈ ఫోన్లను హెచ్డిఎఫ్సి బ్యాంక్ , ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డులను ఉపయోగించి తీసుకోవడం వలన రూ.7,000 వరకు తగ్గింపును పొందవచ్చు. అయితే ఇది కేవలం ఈఎంఐ ట్రాన్సాక్షన్లకు మాత్రమే వర్తిస్తుంది. అలాగే బజాజ్ ఫైనాన్స్ కస్టమర్లు అయితే అదనంగా 1000 వరకు తగ్గింపును పొందవచ్చు. ఏ ఫోన్స్ ఎంత తగ్గింపుతో లగిస్తున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.వివో టీ1 5జీ ఫోన్‌ యొక్క అసలు ధర రూ.15,990 గా ఉంది. అయితే దీన్ని ఆఫర్స్ తో కేవలం రూ.13,990 కు పొందవచ్చు. అలాగే వీ25 ఫోన్‌ను బ్యాంక్ ఆఫర్స్ తో కేవలం రూ. 25,999కు పొందవచ్చు. దీని అసలు ధర చూస్తే రూ. 32,999 గా ఉంది .. అలాగే వీ25 ప్రో స్మార్ట్‌ఫోన్ అసలు ధర రూ.39,999. అయితే దీన్ని సేల్‌లో రూ.32,499 కే కొనుగోలు చేయవచ్చు .వై16 (3+ 32 జీబీ) ఫోన్‌ను రూ. 13,999 గల ఫోన్ ను కేవలం రూ.9,249కు కొనొచ్చు.

Advertisement
Vivo Diwali offers... Vivo smartphone for 101 rupees
Vivo Diwali offers… Vivo smartphone for 101 rupees

అలాగే రూ.17,990 విలువ గల వై22 ఫోన్ ను రూ. 13,749కు సొంతం చేసుకోవచ్చు. అలాగే టీ1ఎక్స్ ఫోన్‌ను రూ.11,999 కే సొంతం చేసుకోవచ్చు .టీ1 ప్రో ఫోన్‌ను 28,990 కు కాకుండా రూ. 18,999కు సొంతం చేసుకోవచ్చు . టీ1 44 వాట్ ఫోన్‌ను రూ. 12,499కే పొందవచ్చు .ఇక దీని అసలు ధర రూ.19,990 గా ఉంది.ఇకపోతే వివో దీపావళి సేల్‌లో భాగంగా రూ.101 స్మార్ట్‌ఫోన్ ఆఫర్ ఉంది. అంటే రూ.101 ఇనీషియల్ పేమెంట్ చేసి వీ, ఎక్స్, వై సిరీస్ ఫోన్ లను గొనుగోలు చేయవచ్చు . అయితే కంపెనీ మిగతా వివరాలను ఇంకా ప్రకటించలేదు. కాని ఈఎంఐ రూపంలో రూ.101 చెల్లించి ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు అని అనుకోవచ్చు.

Advertisement