Chicken Fry : చికెన్ ఫ్రై ని ఒక్కసారి ఇలా చేసి తిని చూడండి.. ఇక అద్భుతం అని చెప్పక తప్పదు…

Advertisement

Chicken Fry : రుచికరమైన చికెన్ ఫ్రై ని చాలా ఈజీగా క్విక్ గా, సింపుల్ ప్రాసెస్ లో తయారు చేసుకుందామండి చాలా ఈజీ.. వంట రాని వాళ్ళు కూడా తయారు చేసేసుకోవచ్చు. దీనికి కావలసిన పదార్థాలు:చికెన్, రెండు, మూడు టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి. రెండు టీ స్పూన్లు కారంపొడి, 1/2 టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడా సాల్ట్ ,వన్ టీ స్పూన్ మిరియాల పొడి, 3 టీ స్పూన్లు ధనియాల పొడి, కారం అనేది ఈ కారంపొడి మిరియాల నుండి మనకు వస్తుంది. తర్వాత మూడు పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకుంటామండి. స్పైసీగా చాలా బాగుంటుంది. రెండు మీడియం సైజు ఉల్లిపాయలు, రెండు టమోటాలు, టమోటా అనేది ఈ చికెన్ ఫ్రై కి చాలా టేస్ట్ వస్తుంది. తప్పకుండా స్కిప్ చేయకుండా వేసుకోండి మూడు పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, ఆయిల్ మొదలైనవి.. దీని తయారీ

Advertisement

విధానం: ముందుగా ఒక బౌల్ లోకి టమాట ముక్కలు తీసుకొని వాటిని చేత్తో స్మాష్ చేసుకొని దాన్లో కారం, ఉప్పు, మిరియాల పొడి, ధనియాల పొడి, పసుపు, గరం మసాలా అన్నిటిని వేసి బాగా కలుపుకోవాలి. ఇక ఆ మిశ్రమాన్ని తీసుకొచ్చి చికెన్ లో కలుపుకోవాలి. దానిలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి. తర్వాత దానిలో రెండు స్పూన్ల ఆయిల్ కూడా వేసి బాగా కలిపి ఒక అర్థగంట పాటు నానపెట్టుకోవాలి. తర్వాత దానిలో కొంచెం కొత్తిమీరను, కరివేపాకు కూడా దాంట్లో కలుపుకోవాలి. తరువాత స్టౌ పై ఒక కడాయిని పెట్టుకుని దానిలో నాలుగు స్పూన్ల ఆయిల్ వేసుకొని దానిలో రెండు లవంగాలు రెండు యాలకులు ఒక దాల్చిన చెక్క ముక్కలు వేయాలి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని కూడా వేసి బాగా ఎర్రగా అయ్యేవరకు వేయించుకోవాలి. ఆ ఉల్లిపాయల్లో కొంచెం కరివేపాకు వేసి వేయించుకున్న తర్వాత.

Advertisement
make chicken fry like this once and try it and it will be amazing
make chicken fry like this once and try it and it will be amazing

మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ని దాంట్లో వేసి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకొని మూత పెట్టి ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో చికెన్ ని కుక్ చేసుకోవాలి. తర్వాత మధ్య మధ్యలో మూత తీస్తూ దాన్ని కలుపుతూ ఉండాలి. తర్వాత మూత పెట్టి పది నిమిషాల పాటు అలాగే ఉంచాలి. నీళ్లు వినికి నూనె తేలే వరకు బాగా వేయించుకోవాలి. అలాగే మూత తీసి బాగా ఫ్రై అయ్యేవరకు కలుపుతూనే ఉండాలి. అలా రెండు మూడు నిమిషాలు తర్వాత పొడిపొడిగా చికెన్ వచ్చేవరకు వేయించుకొని చివర్లో పచ్చిమిరపకాయల్ని కట్ చేసి దాన్లో వేసుకుంటే చాలా బాగుంటుంది. అంతే చికెన్ పొడిపొడి లాడుతున్న టైంలో కొంచెం కొత్తిమీరని చల్లి సర్వ్ చేసుకోవడమే… అంతే ఎంతో సింపుల్ గా చికెన్ ఫ్రై రెడీ.

Advertisement