Wheat flour snacks : సాయంత్రం కాగానే పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు ఈజీగా గోధుమ పిండితో స్నాక్స్ చేస్తే వాళ్లు ఎంతో ఇష్టంగా తింటారు. గోధుమ పిండితో స్నాక్స్ చేయడానికి ఎంతో సమయం కూడా పట్టదు. సరైన కొలతలతో గోధుమపిండి స్నాక్స్ చేస్తే ఎంతో బాగా వస్తాయి. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకొని తినాలనిపిస్తుంది. పిల్లలు అయితే వీటిని అస్సలు వదిలిపెట్టరు పూర్తిగా తినేస్తారు. అంత రుచిగా ఉంటాయి ఇవి. మరి ఇంకెందుకు ఆలస్యం గోధుమ పిండితో స్నాక్స్ ఎలా తయారు చేసుకోవాలి. దానికి కావలసిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు: 1) గోధుమపిండి 2) వాము 3) జీలకర్ర 4) నెయ్యి 5) కస్తూరి మేతి 6) ఉప్పు తయారీ విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు గోధుమపిండి వేసి అర టీ స్పూన్ వాము, అర టీ స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ కస్తూరి మేతిని చేతిలో వేసుకొని నలిపి గోధుమ పిండిలో వేయాలి. తరువాత రుచికి సరిపడా ఉప్పు, వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత పిండిలో గోరువెచ్చని నీళ్లు కొద్దికొద్దిగా పోసుకుంటూ చపాతి ముద్దలాగా చేసుకోవాలి. తర్వాత ఒక పది నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి.

తరువాత మూడు ఉండలుగా చేసుకొని చపాతి పిండిని అద్దుతూ అప్పలాగ చేసుకోవాలి. తర్వాత ఈ అప్పను ఒక మూతతో బిస్కెట్ షేప్ లో కట్ చేసుకోవాలి. ఈ అప్ప పైన ఒక స్పూన్ తో హోల్స్ లాగా పెట్టుకోవాలి. ఇలా చేయడం వలన క్రిస్పీగా కరకరలాడుతూ వస్తాయి. ఇప్పుడు ఈ అప్పలను బాగా కాగిన నూనెలో వేయించుకోవాలి. అప్పని అటు ఇటు తిప్పుతూ మంచి కలర్ వచ్చేవరకు వేయించుకోవాలి. తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుంటే ఎంతో టేస్టీ అయిన గోధుమపిండి స్నాక్స్ రెడీ అయిపోయినట్లే. ఇవి ఎంతో టేస్టీగా ఉంటాయి. పిల్లలు అయితే వీటిని ఎంతో ఇష్టంగా తింటారు.