Sri Reddy : క్యాస్టింగ్ కౌచ్‌తో వార్తలలో నిలిచిన శ్రీరెడ్డి ఆ తర్వాత పల కాంట్రవర్సీలతో హాట్ టాపిక్‌గా మారింది. ఏ విషయంపైనైన సుదీర్ఘంగా చర్చిస్తూ నానా రచ్చ చేసే ఈ అమ్మడు ఇటీవల యూట్యూబ్‌లో వెరైటీ వంటకాలు చేస్తూ తెగ అలరిస్తుంది. క్యాస్టింగ్ కోచ్ పై పోరాటం అప్పట్లో బాగా ఫేమస్ అయింది. అప్పట్లో ఆమె చేసిన పోరాటం తీవ్ర స్థాయిలో సంచలనం రేపింది. ఏడాది పాటు ఆమె పేరు మార్మోగిపోయింది. టాలీవుడ్ లో కొందరు ప్రముఖులను, వారి పుత్రులను టార్గెట్ చేస్తూ పోరాటానికి దిగింది. హీరోయిన్ కావాలని సినిమాల్లోకి వచ్చిన ఆమె పలు ఇబ్బందులు ఎదుర్కొంది. ఆ తర్వాత తమిళ సినిమాల్లో కొన్ని సినిమాలలో కూడా ట్రై చేసింది.
రుచికరమైన వంటకం..
క్యాస్టింగ్ కౌచ్‌తో బాగా పాపులారిటీ పొందిన శ్రీరెడ్డి ఆ తర్వతా తనదైన శైలిలో కామెంట్స్ చేస్తూ నిత్యం వార్తలలో నిలుస్తుంటుంది. ఇటీవల ఈ అమ్మడు వెరైటీ వంటకాలు చేస్తూ తెగ నోరూరించేస్తుంది. అంతేకాదు తన వంటకాలతో బాగానే డబ్బులు సంపాదిస్తుంది. శ్రీరెడ్డి రచ్చ చూసి ప్రతి ఒక్కరు అవాక్కవుతున్నారు. అంతేకాక ఈ అమ్మడిని నిత్యం ఫాలో అవుతున్నారు. మటన్ విత్ గోంగూర కూర వండిన శ్రీరెడ్డి తనదైన శైలిలో నోరూరించేసింది. ప్రస్తుతం శ్రీరెడ్డి వంటకాలకి సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తుంది.

కాస్టింగ్ కౌచ్ అంటూ శ్రీరెడ్డి ఇండస్ట్రీలో ఉన్న ఎన్నో చీకటి విషయాలు, తెర వెనక తతంగాలను బయట పెట్టింది. ఈ క్రమంలోనే శ్రీ రెడ్డి కాస్టింగ్ కౌచ్ గురించి పెద్ద ఉద్యమమే లేవదీసింది. తెలుగు అమ్మాయిలకు హీరోయిన్లుగా ఛాన్సులు ఇవ్వడం లేదంటూ పెద్ద ఎత్తున ఆమె ఉద్యమమే చేసింది. ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలవడం.. ఆ విధంగా పాపులర్ అవ్వడం ఆమెకు అలవాటుగా మారిపోయాయి. ఇక మెగా ఫ్యామిలీ అన్నా , పవన్ కళ్యాన్ అన్నా కూడా శ్రీ రెడ్డి ఎలా విరుచుకు పడుతుందో ? ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.