DOG : కుక్కలు ఎంత విశ్వాసంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.కుక్కలకు మనుషులకు ఉన్న అనుబంధం అలాంటిది. చాలామంది విశ్వాసంగా ఉండే ఈ మూగజీవులను తన కుటుంబ సభ్యులుగా భావించి వాటిని ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటారు. అలా చూసుకునే యజమానుల పట్ల అవి కూడా అంతే విశ్వాసంగా ఉంటాయి.కాని ఇటీవల కొందరు పెంపుడు జంతువులైన కుక్కల మీద కూరత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ మధ్యకాలం ఇవి చాలాచోట్ల జరుగుతున్నాయి.కొద్దిరోజుల క్రితం ఒక మహిళ తన పెంపుడు కుక్క ను నెలకేసి కొట్టగా… ఒక డాక్టరు కుక్కను తాడు తో కట్టి కార్ తో ఈడ్చుకెళ్లాడు.
తాజాగా ఇలాంటి దారుణమే బెంగళూరులో చోటుచేసుకుంది.ఈస్ట్ బెంగుళూరు కేఆర్ పురం పోలీస్ స్టేషన్ పరిధిలోని మంజునాథ లేఅవుట్లో ఈ సంఘటన చోటుచేసుకుంది.కొంతమంది కుర్రకారులు రోడ్డు మీద పోతుంటే…తమను చూసి కుక్క మొరిగిందన్న కారణంతో ఆ మూగజీవి పై దాడికి దిగారు.దాని మెడకు ఉన్న చైన్ ను ముందరి కాళ్ళతో బంధించి కర్రలతో చితకబాదారు. దెబ్బలు తట్టుకోలేక ఆ మూగజీవి వెలవెలబోతున్న వదిలిపెట్టలేదు ఆ క్రూరులు.చుట్టు ప్రక్కల ఉన్నవారు విడిపించడానికి ప్రయత్నించిన వినిపించుకోకుండా అలాగే చేశారు. ఇంతలో ఆ కుక్క యజమాని అక్కడకు చేరుకుని వారిని నిలదీయగా వెంటనే అక్కడి నుండి వెళ్లిపోయారు.

తీవ్రంగా గాయపడిన కుక్కను యజమాని హాస్పిటల్ కు తీసుకెళ్లినట్లుగా తెలుస్తోంది.అయితే ఆ సంఘటన జరిగిన ప్రదేశంలో ఉన్నవారు వీడియో తీయడంతో ,ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీని ఆధారంగా కేసు నమోదు చేసి ఆ క్రూరలను శిక్షించాలని యజమాని ఫిర్యాదు చేశారట. ఇలా ఉండగా వీడియో వైరల్ కావడంతో జంతు ప్రేమికులు మండి పోతున్నారు. అసలు వాళ్లు మనుషులేనా ,మూగ జీవిని పట్టుకొని అలా ఎలా కొడుతున్నారు అని కామెంట్ చేస్తున్నారు.ఇలాంటి వారిని అస్సలు వదలకూడదు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
In a Inhuman act, A dog was thrashed by Neighbours mercilessly for barking at them previous night at Manjunath Layout near Bhattarahalli. A case has been registered at KR Puram police station. Dog shifted to veterinary hospital by the dog owner for medication. @peta pic.twitter.com/uCcrv8b4bl
— Sagay Raj P || ಸಗಾಯ್ ರಾಜ್ ಪಿ (@sagayrajp) October 4, 2022