whatsapp : ఈరోజుల్లో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ వాట్సాప్ ను వినియోగిస్తున్నారు. తమ జీవితంలో జరిగే ప్రతి ఒక్క విషయాన్ని వాట్సాప్ ద్వారా అందరికీ షేర్ చేసుకుంటున్నారు. అలాగే కొంతమంది గ్రూప్స్ క్రియేట్ చేసుకుని తమ ప్రాంతాలలో జరిగే వార్తలను కూడా షేర్ చేసుకుంటున్నారు. ఇది ఫ్రీగా రావడంతో ప్రతి ఒక్కరు వినియోగిస్తున్నారు. అయితే దీనిలో భాగంగా వాట్సాప్ కొత్త ఫీచర్లను తీసుకురాబోతుంది.గ్రూపుల విషయంలో వాట్సాప్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్లోని సభ్యుల సంఖ్యను రెండింతలు పెంచేలా ఫీచర్ ను తీసుకురానుంది. దీంతో వాట్సప్ గ్రూపులలో వెయ్యి మందికి పైగా సభ్యులు ఉండవచ్చని సమాచారం.
గతంలో అయితే ఒక గ్రూప్ కి గరిష్టంగా 256 సభ్యులు ఉండేవారు. కొన్ని రోజుల క్రితం ఆ సంఖ్యను 512 కు పెంచింది వాట్సాప్. అయితే త్వరలో ఈ సంఖ్యను మరింత రెట్టింపు చేయనుంది. ఈసారి గరిష్టంగా 1024 మంది సభ్యులు ఉండేలా అప్ డేట్ ను తీసుకొస్తుంది.ఆల్రెడీ ఈ అప్ డేట్ వాట్సాప్ డేటా యూసర్లకు వచ్చేసింది. ఇక త్వరలోనే సాధారణ యూజర్లకు కూడా ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుంది.మరిన్ని ఫీచర్లు : అలాగే వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ కోసం అప్రూవల్ సిస్టం ను తీసుకురానుంది. ఇంకా ఎవరైనా గ్రూప్లో చేరాలి అనుకుంటే అడ్మిన్ అప్రూవ్ చేయాల్సి ఉంటుందట.

అయితే గ్రూప్లో చేరడానికి వచ్చిన రిక్వెస్ట్ లు అన్ని ఒక లిస్టు లో కనిపిస్తాయట. వాటిని చెక్ చేసుకుని అడ్మిన్ ,గ్రూప్లో యాడ్ చేయడమో లేదా రిక్వెస్ట్ క్యాన్సిల్ చేయడం చేయవచ్చు. అలాగే వాట్సాప్ స్టేటస్ లో కూడా కొత్త అప్ డేట్ రానుంది. స్టేటస్ లో ఆడియో మెసేజ్ కూడా పెట్టుకునేలా ఫీచర్ తీసుకొస్తుంది వాట్సాప్. వాట్సాప్ స్టేటస్ బటన్ క్లిక్ చేస్తే అక్కడ వాయిస్ రికార్డ్ అనే ఆప్షన్ చూపిస్తుంది. దీంతో వాయిస్ రికార్డ్ చేసి స్టేటస్ గా పెట్టుకోవచ్చు.